జీవితంలో మరిచిపోలేరు : ముద్దు పెట్టుకుంటుండగా నదిలో పడిపోయారు

ప్రస్తుత జనరేషన్ లో చాలామంది ప్రీవెడ్డింగ్ ఫొటో షూట్స్ చేస్తూ జీవితంలో స్వీట్ మెమోరీస్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఓ ప్రీవెడ్డింగ్ ఫొటోషూట్ లో అనుకోకుండా  ఫొటో తిరగబడింది. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ లో భాగంగా ఓ నదిలో పడవలో కూర్చుని జంట ముద్దుపెట్టుకోబోతుండగా.. పడవ బ్యాలెన్స్‌ తప్పి.. ఇద్దరు అమాంతంగా నీళ్లలో పడిపోయారు. ఈ సంఘటన ఇటీవల కేరళలోని ఓ నదిలో జరుగగా ఈ వీడియో వైరల్ అయ్యింది.

థిరువల్లకు చెందిన తిజిన్‌ థాంకచెన్‌, చంగనచెర్రీకి చెందిన శిల్ప మే నెల ఆరో తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు. వారు పథనంతిట్టు జిల్లాలోని పంబా నది ఒడ్డును ప్రీవెడ్డింగ్‌ షూట్‌లో పాల్గొన్నారు. షూట్‌ లో భాగంగా ఫొటోగ్రాఫర్‌ సూచనల మేరకు పడవలో కూర్చున్న వారు ముద్దు​పెట్టుకుంటుండగానే.. అమాంతం పడవ అదుపుతప్పడంతో.. నీళ్లలో పడిపోయారు.

అదృష్టం బావుండి పెద్దగా లోతు లేకపోవడంతో వీరికి పెద్దగా గాయాలు కాలేదు. కానీ వారు అమాంతం నీటిలో పడిపోయిన వీడియోపై పలువురు జోక్స్ వేసుకుంటున్నారు. పెళ్లికి ముందే ఇలా చేయాలనుకుంటే అలాగే అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రీవెడ్డింగ్ ఏమోగానీ.. నదిలో పడిన సంఘటన మాత్రం వీరు జీవితంలో మరిచిపోలేరు అంటూ మరికొందరు ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు.

Latest Updates