ఓల్డేజ్ హోంలో లవ్ మ్యారేజ్.. ఫోటోలు వైరల్

ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించింది ఓ వృద్ధ జంట. 60 ఏళ్ల వయసులో ప్రేమ పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ జంట. ప్రస్తుతం ఈ ఓల్డేజ్ కపుల్ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కేరళలోని త్రిస్సూర్ జిల్లా రామవర్మపురంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓల్డేజ్ హోంలో ఇద్దరు వృద్ధులు కొచానియన్ మీనన్(67) , లక్ష్మి అమ్మల్ (65)  కలుసుకున్నారు.  కొంత కాలంగా  ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని సిద్ధమయ్యారు. దీంతో ఓల్డేజ్ హోంలో అందరు వృద్ధుల మధ్య వీరి వివాహం  జరిగింది. లక్ష్మి అమ్మల్ ఎర్రటి పట్టు చీర కట్టుకుని మల్లె పువ్వులు పెట్టుకుని రెడీ అవగా..కొచానియన్ సాంప్రదాయ ఆఫ్-వైట్ డ్రెస్ తో రెడీ అయ్యాడు. దండలు మార్చుకుని స్వీట్లు తినిపించుకుంటూ ముద్దులు పెట్టుకున్నారు. యువ జంటకు ఏమాత్రం తీసిపోకుండా వీరి పెళ్లి జరిగింది. సోషల్ మీడియాలో ఈ ఓల్డేజ్ కపుల్ కు చాలా మంది విషెస్ చెబుతున్నారు.

Latest Updates