ప్రీ వెడ్డింగ్ తో మెస్మరైజ్ చేస్తున్న గే జంట

కేరళ గే జంట ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కాబోయే వధూవరులు ఏ విధంగా వెడ్డింగ్ షూట్లో మెస్మరైజ్ చేసేలా ఫోజిలిస్తారో..ఈ గే జంట కూడా అలాంటి ఫోజులతో హల్ చల్ చేస్తుంది.

కేరళకు చెందిన  నైవేడ్ ఆంటోనీ చుల్లికల్, అబ్దుల్ రహీమ్ లు గేలు. సుమారు 5 సంవత్సరాల పాటు డేటింగ్ చేశారు. డేటింగ్ లో వాళ్లిద్దరు ఒకరినొకరు అర్ధం చేసుకొన్నారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ దేశంలో ఉన్న చట్టాలతో పెళ్లి చేసుకోవడం సాధ్యపడలేదు. దీంతో ఆ ఇద్దరు డేటింగ్ కొనసాగించారు.

సుప్రీం కోర్ట్ గేల శృంగారంపై ఇచ్చిన తీర్పుతో ఆంటోనీ, అబ్దుల్ లు పెళ్లికి అడ్డంకి తొలిగిపోయింది. దీంతో వాళ్లిద్దరు పెళ్లిపీఠలెక్కనున్నారు.

అందుకోసం పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించారు. ఈ షూట్ లో రకరకలా ఫోజులిస్తూ ఫోటోలు దిగారు. ఆ ఫోటోల్ని నెట్టింట్లో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి.

వారి గే పెళ్లి గురించి, కుటుంబసభ్యుల సహకారం గురించి ప్రస్తావించగా..తమలో ఉన్న లక్షణాలను గుర్తించి ఒకరినొకరు ఇష్టపడినట్లు చెప్పారు. త్వరలో పెళ్లి చేసుకుంటున్నట్లు, పెళ్లికి సమాజం నుంచి చీత్కారాలు, కుటుంబం నుంచి తిరస్కారాలు కామనేనని, అయినా తాము పెళ్లి చేసుకుంటున్నట్లు ఆంటోనీ, అబ్దుల్ తెలిపారు.

Latest Updates