చేపల అమ్మకాన్ని నిషేధించిన కేరళ ప్రభుత్వం

కరోనా తీవ్రత దృష్ట్యా రోడ్డు పక్కన చేపల అమ్మకాన్ని కేరళ ప్రభుత్వం నిషేధించింది. రోడ్డు పక్కన అమ్మే చేపలు తక్కువ ధరకు వస్తుండటంతో.. ప్రజలు వాటిని ఎక్కువగా కొనుగోలు చేసేవారు. అయితే అలా రోడ్డు పక్కన అమ్మే చేపల వల్ల కూడా కరోనా సోకే ప్రమాదముందని అక్కడి ప్రభుత్వం చేపల అమ్మకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

‘వ్యాపారం నడవకపోవడంతో మా దగ్గర డబ్బు లేదు. దాంతో ఇల్లు గడవడం కూడా కష్టంగా మారింది. కోవిడ్ -19 కారణంగా కొట్టాయం ప్రజలు మా దగ్గర చేపలు కొనడం లేదు’ అని కొట్టాయంకు చెందిన చేపల వ్యాపారి శశి కుమార్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా.. రాష్ట్ర ప్రజలందరూ రాబోయే ఓనం పండుగను ఇంట్లోనే జరుపుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రజలను కోరారు. పండుగ కోసం స్థానికంగా లభించే పువ్వులనే వాడాలని ఆయన సూచించారు. పువ్వుల ద్వారా కూడా కరోనా సోకే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు.

కేరళలో తాజాగా కరోనా కేసుల సంఖ్య 50 వేల మార్కును దాటింది. ఇప్పటివరకు అక్కడ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 32,607కు చేరింది. రాష్ట్రంలో కరోనా వల్ల ఇప్పటివరకు 187 మంది మృతిచెందారు.

For More News..

గ్యాప్ వచ్చిందంతే.. ఏదీ ఆగలేదు..

ధోని ఆ రాత్రంతా జెర్సీతోనే ఉన్నాడు.. ఏడ్చాడు..

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోడీ

తెలంగాణలో కొత్తగా 1,724 కరోనా కేసులు

Latest Updates