గవర్నమెంట్ ఉద్యోగుల నెల జీతం కట్

తిరువనంతపురం : కేరళలో గవర్నమెంట్ ఉద్యోగుల నెల జీతాన్ని కట్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా ఎఫెక్ట్ తో ఆదాయం తగ్గటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకేసారి జీతంలో కోత విధించకుండా నెలకు 6 రోజుల జీతం కట్ చేయనున్నారు. ఈ విధంగా 5 నెలల పాటు నెలకు 6 రోజుల చొప్పున 30 రోజుల జీతం కట్ చేస్తారు. ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. 20 వేల లోపు జీతాలున్న ఉద్యోగులు, పెన్షనర్లకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. లాక్ డౌన్ కారణంగా వసూలు పెద్ద ఎత్తున తగ్గాయని…ఈ పరిస్థితిని నుంచి బయటపడేందుకే జీతాల్లో కోత విధించాల్సి వచ్చిందని విజయన్ తెలిపారు. ఇక ప్రజాప్రతినిధులందరీ జీత్లాల్లోనూ ఏడాది పాటు 30 శాతం కోత ఉంటుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనందునే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇందుకు ఉద్యోగులంతా సహకరించాలని కోరారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత కోత విధించిన డబ్బులు తిరిగి చెల్లిస్తామన్నారు. 2018 లోనూ కేరళను వరదలు ముంచెత్తిన సందర్భంలో ప్రభుత్వం ఉద్యోగుల నెల జీతంలో కోత విధిస్తామని తెలిపింది. దీంతో ఉద్యోగ సంఘాలు హైకోర్టుకు వెళ్లాయి. దీంతో ఈ సారి ఓకేసారి నెల రోజుల జీతాన్ని కట్ చేయకుండా నెలకు 6 రోజుల జీతాన్ని కట్ చేస్తామని తెలిపింది.

Latest Updates