కరోనా రిపోర్ట్ కోసం మనసు చంపుకొని డాక్టర్‌తో..

కరోనా నెగిటివ్ రిపోర్ట్ కోసం వచ్చిన మహిళపై అత్యాచారం చేసిన ఘటన కేరళలో వెలుగుచూసింది. తిరువనంతపురం సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 44 ఏళ్ల మహిళకు కరోనా సోకింది. దాంతో ఆమె కులాతుపుజ సమీపంలోని ఒక బంధువు ఇంట్లో క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటుంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ ప్రతిరోజూ ఆమె ఇంటికి వెళ్లి చెక్ చేసేవాడు.

అలా 16 రోజుల హోంక్వారంటైన్ ముగిసిన తర్వాత.. కరోనా నెగెటివ్ రిపోర్ట్ కావాలంటే తన ఇంటికి వచ్చి తీసుకోవాలని తెలిపాడు. దాంతో నెగిటివ్ సర్టిఫికెట్ కోసం బాధితురాలు ప్రదీప్ ఇంటికి వెళ్లింది. ఇంట్లోకి వచ్చిన మహిళను ప్రదీప్ గట్టిగా పట్టుకొని.. బలవంతం చేశాడు. అక్కడి నుంచి సర్టిఫికెట్‌తో బయటపడిన మహిళ.. సెప్టెంబర్ 3న వెల్లారడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఈ కేసును పాంగోడ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ప్రదీప్ నుంచి ప్రాణాలకు ప్రమాదమని భావించి అతడితో ఇష్టంలేకపోయినా.. లైంగికంగా కలిసినట్లు సదరు మహిళ పోలీసులకు తెలిపింది. ఈ అత్యాచారానికి సంబంధించిన పలు ఆధారాలున్నట్లు పాంగోడ్ పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఆరోపణలను ధృవీకరించడానికి మరిన్ని ఆధారాల కోసం ఫోరెన్సిక్ వివరాల కోసం ఎదురు చూస్తున్నట్లు వారు తెలిపారు. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపరిచారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రదీప్‌ను ప్రభుత్వ సర్వీసుల నుంచి తొలగిస్తున్నట్లు కేరళ ఆరోగ్య మంత్రి కేకే. శైలాజా ఆదేశించారు.

For More News..

మార్కెట్లోకి వచ్చిన స్పుత్నిక్ వ్యాక్సిన్

రాష్ట్రంలో మరో 2,932 కరోనా పాజిటివ్ కేసులు

ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి

Latest Updates