3.75 లక్షల మంది పిల్లలు స్కూళ్లకు రావొద్దు..ఇంటికే మిడ్ మే మీల్స్

మిడ్ డే మీల్స్, పౌష్టికాహారా  మెటీరియల్  కోసం పిల్లలు స్కూల్ కు రావొద్దని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ విజృంభించడంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటి వరకు 22మందికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. అయితే ఈ వైరస్ నుంచి పెద్దల నుంచి పిల్లలవరకు సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న 33,000 అంగన్ వాడీ కేంద్రాల్లో నమోదు చేసుకున్న పిల్లలకు అందించే పౌష్టికాహార మెటీరియల్  ఇంటికే సరఫరా చేస్తున్నట్లు కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది. పిల్లల తల్లిదంద్రులు అంగన్ వాడీ కేంద్రాల నుంచి మెటీరియల్ ను  కలెక్ట్ చేసుకోవాలని సూచించింది.

అంగన్ వాడీ స్కూల్లో 3.75మిడ్ డే మీల్ మెటీరియల్ సరఫరా 

సోషల్ జస్టీస్ డిపార్ట్ మెంట్  పర్యవేక్షణలో 33,115 అంగన్‌ వాడీ కేంద్రాల్లో  మధ్యాహ్నం పౌష్టికాహారాన్ని అందిస్తారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య వయస్సు గల 3.75 లక్షల మంది పిల్లలకు పోషకాలను సరఫరా చేస్తారు. “ఒక రోజున, ఒక అబ్బాయి లేదా అమ్మాయికి 60 గ్రాముల బియ్యం, 50 గ్రాముల గోధుమలు, 20 గ్రాముల పచ్చ పెసలు, 5 గ్రాముల ఉరద్ పప్పు (మినప పప్పు), 5 గ్రాముల వంట నూనె అందజేస్తున్నట్లు, వైరస్ నేపథ్యంలో అంగన్‌వాడీలు మూసివేసిన తరువాత పిల్లలు పౌష్టికాహార పదార్ధాల్ని ఇంటికే చేరవేస్తామని అధికారి తెలిపారు.

వీదేశీయుల వల్లే కేరళలో కరోనా ప్రభావం 

శుక్రవారం తిరువనంతపురంలో నమోదైన మూడు కేసుల్లో వర్కాలా బీచ్‌లోని రిసార్ట్‌లో బస చేసిన ఇటాలియన్ దేశానికి చెందిన వ్యక్తి ఉన్నాడు.  మిగిలిన ఇద్దరు ఇటలీ,యూకేకి చెందిన పర్యాటకుల వల్ల స్థానికులకు కరోనా సోకినట్లు ఇండయన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది.

కరోనాపై స్పందించిన ముఖ్యమంత్రి

తాజా కరోనా కేసులపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ స్వదేశాలకు, విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు కరోనా స్క్రీనింగ్ టెస్ట్ లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వం కార్యాలయాల్లో కరోనా వైరస్ స్క్రీనింగ్ లు చేస్తామని ప్రకటించారు.

Latest Updates