కట్టకముందే ఇంటిని చూడొచ్చు!

హైదరాబాద్‌‌, వెలుగు: వర్చువల్‌‌రియాల్టీ (వీఆర్‌‌) టెక్నాలజీ ద్వారా ఇళ్లను డిజైన్‌‌చేసే సేవలను హైదరాబాద్‌‌లో ప్రారంభించినట్టు కేరళకు చెందిన ఐటీ ఆధారిత నిర్మాణసంస్థ బిల్డ్‌‌నెక్ట్స్‌‌మంగళవారం ప్రకటించింది. వినియోగదారులు తమ ఇల్లు/అపార్ట్‌‌మెంట్‌‌/విల్లా ఎలా ఉంటుందో వీఆర్‌‌టెక్నాలజీతో చూపించడానికి హైదరాబాద్‌‌లోని బంజారాహిల్స్‌‌లో ప్రత్యేక వీఆర్‌‌ఎక్స్​పీరియెన్స్​ సెంటర్‌‌ను ఏర్పాటు చేసినట్టు కంపెనీ ఫౌండర్‌‌గోపాలకృష్ణన్‌‌వెల్లడించారు. హైదరాబాద్‌‌లో తమ సేవలకు అద్భుత ఆదరణ కనిపిస్తోందని, కేవలం వంద రోజుల్లో ఆరు లక్షల చదరపు అడుగుల స్థలానికి డిజైనింగ్‌‌కాంట్రాక్టులు వచ్చాయని చెప్పారు. నగరంలోని హైటెక్‌‌సిటీ ప్రాంతంలో మరో వీఆర్‌‌సెంటర్‌‌ను, ఫైనాన్షియల్‌‌డిస్ట్రిక్ట్‌‌లో ఆర్ అండ్‌‌సెంటర్‌‌ను త్వరలోనే ప్రారంభిస్తున్నట్టు గోపాలకృష్ణన్‌‌వివరించారు.

రాబోయే 12 నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా ఐదు వీఆర్‌‌ట్రయల్‌‌రూమ్స్‌‌/ఎక్స్‌‌పీరియన్స్‌‌సెంటర్లను ఏర్పాటు చేస్తామని సంస్థ కో–ఫౌండర్‌‌ఫినాజ్ నాహా చెప్పారు. తొలి ఏడాది రూ.100 కోట్ల టర్నోవర్ తమ లక్ష్యమని ప్రకటించారు. ప్రస్తుతం కేరళ, తెలంగాణలో సేవలు అందిస్తున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు సేవలను విస్తరిస్తామని వివరించారు. టెక్నాలజీ సాయంతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్లను నిర్మించడం తమ ప్రత్యేకత అని చెప్పారు.  రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం తమకు 110 మంది ఉద్యోగులు ఉన్నారని, కొచ్చిన్‌‌లో ప్రధాన కార్యాలయం ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.నాలుగు కోట్లు ఇన్వెస్ట్ చేశామని ఫినాజ్‌‌అన్నారు. తాము రియల్‌‌టైమ్‌‌ప్రాజెక్ట్ ట్రాకింగ్‌‌, క్వాలిటీ మానిటరింగ్‌‌, బడ్జెట్‌‌కంట్రోల్‌‌ వంటి సేవలనూ అందిస్తామని తెలిపారు.

 

Latest Updates