క్వారంటైన్ లోకి కలెక్టర్

కన్నూర్: కరోనా వైరస్ పాజిటివ్ కన్ఫామ్ అయిన టీవీ జర్నలిస్ట్ కు ఇంటర్వ్యూ ఇచ్చినట్లు తేలడంతో కేరళలోని కాసరగోడ్ జిల్లా కలెక్టర్ డి సాజిత్ బాబు క్వారంటైన్ కి వెళ్లారు. కొద్దిరోజుల కిందటే కలెక్టర్ సాజిత్.. మావుంగల్ నివాసి అయిన 24 ఏళ్ల టీవీ జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ జర్నలిస్టుకు కరోనా సోకినట్లు బుధవారం తేలింది. అతని కాంటాక్ట్స్ ట్రేస్ చేయగా.. కలెక్టర్ ను కలిసినట్లు గుర్తించారు. దీంతో కలెక్టర్ తో పాటు, ఆయన డ్రైవర్, గన్ మన్ ను హోం క్వారంటైన్ లో ఉండాల్సిందిగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశించారు. పాజిటివ్ కన్ఫామ్ అయిన జర్నలిస్ట్, కెమరామన్, మరో సిబ్బందిని కూడా క్వారంటైన్ కి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
‘‘ఏప్రిల్ 19 న జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చాను. అతని వైరస్ సోకినట్లు బుధవార తేలింది. నాతో పాటు, నా డ్రైవర్, గన్​మన్ ను హోం ఐసోలేషన్ లో ఉండాలని ప్రభుత్వం సూచించింది”అని జిల్లా కలెక్టర్ సాజిత్ బాబు మీడియాతో అన్నారు.

Latest Updates