కేరళలో తొలి లేడీ రోబో పోలీస్

దేశంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ పోలీస్ రోబోను ఆవిష్కరించారు కేరళ సీఎం పినరయి విజయన్. KP-బాట్ అనే రోబోను తిరువనంతపురంలోని రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఇనాగ్రేట్ చేశారాయన.  కొచ్చి కేంద్రంగా పనిచేసే అసిమోవ్ రోబోటిక్స్ అనే స్టార్టప్ ఈ రోబోను అభివృద్ధి చేసింది.

లేడీ రోబో పోలీస్ డ్యూటీస్

కొచ్చి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఈ రోబో పోలీస్ డ్యూటీ చేస్తుంది. దీన్ని లేడీ పోలీస్ రూపంలో తయారు చేశారు. హెడ్ క్వార్టర్స్ కు వచ్చే వారిని రిసీవ్ చేసుకుని, వారి ఫిర్యాదులను రికార్డ్ చేసుకుంటుంది. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వారిని అది గుర్తు పెట్టుకుంటుంది. మళ్లీ వస్తే వారి రికార్టులను వెంటనే బయటకు తీసి పని ఫాస్ట్ గా పూర్తి చేస్తుంది. అలాగే పై అధికారులను కలవాల్సిన వారికి అపాయింట్ మెంట్స్ ఇవ్వడం, వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడం వంటి పనులన్నీ కేపీ బాట్ చూసుకుంటుంది. భవిష్యత్తులో పేలుడు పదార్థాలను గుర్తించి డిఫ్యూజ్ చేసేలా దీన్ని డెవలప్ చేస్తున్నట్లు ఏడీజీపీ మనోజ్ అబ్రహాం తెలిపారు.

Latest Updates