చెన్నై నీటి కష్టాలు: కేరళ నుంచి వాటర్ రైళ్లు

kerala-sending-water-through-trains-to-chennai

చెన్నై నీటి  సమస్యను తీర్చడానికి కేరళ ముందుకు వచ్చింది. చెన్నైకు రైల్ వ్యాగన్ ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంది. కేరళ వేలూర్ జిల్లా జోలార్ పేట నుంచి చెన్నైకి వ్యాగన్ లతో నీటిని తరలిస్తునారు. 2.5 మిలియన్ల నీటిని ఈ రైళ్లు తీసుకెళుతున్నాయి. ఇందుకుగాను రైలు సమాచారాన్ని అధికారులు మీడియాకు తెలియజేశారు. మొదటి రైలు విల్లివక్కమ్ రైల్వే స్టేషన్లో ఆగనుందని తెలిపారు. రైలు ఆగిన స్టేషన్ లో తొక్కిసలాట జరగకుండ పోలీసు భధ్రతను ఏర్పాటు చేయనున్నారు.

తమిళనాడు ప్రభుత్వం ఒక్కో ట్రిప్పునకు రూ.7.5 లక్షలను దక్షిణ మధ్య రైల్వేకు చెల్లిస్తుంది. ఇందుకు గాను ఆ రాష్ట్ర ప్రభుత్వం 65కోట్ల రూపాయలను కెటాయించింది. చెన్నైకి రోజుకు 10 మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంది. కేరళ నుంచి వెళ్తున్న నీళ్లు సగం మందికి మాత్రమే దాహాన్ని తీర్చనున్నాయి. తమిళనాడు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. జోలార్‌ పేట నుంచి చెన్నై విల్లివక్కంకు రైలు చేరుకోవడానికి ఐదు గంటలు పడుతుంది. అక్కడ ఉన్న కిల్పాక్‌ వాటర్‌ వర్క్స్‌ అనే సంస్థ  ఈ నీటిని ప్రజలకు చేరవేస్తుంది.

Latest Updates