18ఏళ్ల కుర్రాడి స్మార్ట్ హెల్మెట్‌‌..మందు తాగి బండి నడుపుతామంటే కుదరదు

కేర‌ళ‌కు చెందిన 18ఏళ్ల ఆడాన్ జాయ్ రోడ్డు ప్ర‌మాదాల్ని నివారించే స్మార్ట్ హెల్మెట్ ను త‌యారు చేశాడు.

రోడ్డు మ‌ర‌ణాలకు ప్ర‌ధాన కార‌ణం హెల్మెట్ లేక‌పోవ‌డం. అయితే వాహ‌న‌దారులు నిర్ల‌క్ష్యంపై ఆలోచ‌న‌లో ప‌డ్డ ఆడాన్ జాయ్ మొబైల్ జీపీఎస్ ద్వారా ద్విచ‌క్ర‌వాహ‌నానికి అనుసందానం చేసిన సెన్సార్ల ద్వారా స్మార్ట్ హెల్మెట్ ను త‌యారు చేశారు.

ఈ స్మార్ట్ హెల్మెట్ రైడర్ హెల్మెట్ ధ‌రించ‌కుండా బైక్ ను స్టార్ చేయ‌లేడు. వాహ‌నం నుంచి హెల్మెట్ కి సెన్సార్ల‌ను అమ‌ర్చ‌డం ద్వారా ..హెల్మెట్ లేకుండా వాహ‌నం న‌డ‌ప‌డం సాధ్యం కాదు.

ఈ సంద‌ర్భంగా కుర్రాడు ఆడాన్ జాయ్ మాట్లాడుతూ ఈ స్మార్ట్ హెల్మెట్ పై 2ఏళ్ల నుంచి ప్ర‌యోగాలు చేస్తున్న‌ట్లు చెప్పాడు. అయితే కొన్ని వారాల క్రితం పూర్తి స్థాయిలో హెల్మెట్ అందుబాటులోకి వ‌చ్చిన‌ట్లు తెలిపారు.

తాను త‌యారు చేసిన జీపీఎస్ ఆధారిత మొబైల్ అప్లికేషన్ ‘మై స్కూటీ యాప్’ ద్వారా నియంత్రిస్తుంది. ఇది కీ లేకుండా ద్విచక్ర వాహనాన్ని రిమోట్‌గా నియంత్రించగలుగుతుంది. ఎస్ఎంఎస్ పంపడం ద్వారా వాహనాన్ని ప్రారంభించడం లేదా ఆపేందుకు ఈ యాప్ స‌హాయ‌ప‌డుతుంద‌న్నారు.

అంతేకాదు ఎవ‌రైనా మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డిపేందుకు ప్ర‌య‌త్నించినా..ఆల్కహాల్-డిటెక్షన్ సౌకర్యం వ‌ల్ల బైక్ యొక్క కిక్‌స్టార్ట్ మెకానిజానికి అనుసంధానించబ‌డింది. తద్వారా తాగిన వ్యక్తి వాహనాన్ని నడపకుండా నిరోధిస్తుంది. హెల్మెట్ లోపల ఉన్న బజర్ ఆల్కహాల్ ఉనికిని గుర్తించి, రైడర్ హెల్మెట్ ధరించిన త‌రువాత‌ మాత్రమే బండిస్టార్ట్ అవుతుంద‌ని యువ‌కుడు ఆడాన్ జాయ్ తెలిపాడు.

దీంతో పాటు ప్ర‌మాద‌హెచ్చ‌రికలు కేవ‌లం 30సెక‌న్ల‌లో వాహ‌న‌దారుడి నుంచి కుటుంబ‌స‌భ్యుల‌కు మెసేజ్ వెళుతుంద‌న్నారు. ఇన్ని ఫీచ‌ర్స్ ఉన్న స్మార్ట్ హెల్మెట్ ధర రూ.5వేలుగా ఉంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం మ‌రో ఇన్నోవేష‌న్ కోసం ప్రిపేర్ అవుతున్న‌ట్లు చెప్పాడు కేర‌ళకు చెందిన 18ఏళ్ల కుర్రాడు.

Latest Updates