మీ పెంపుడు కుక్కలను అదుపులో పెట్టండి..చంద్రబాబుకు కేశినేని ట్వీట్

ఏపీ టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. ఎంపీ కేశినేని నాని,ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధానికి తెరలేపుతున్నారు. నిన్న ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోగా.. లేటెస్ట్ గా కేశినేని నాని  మరోసారి ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన లాంటి వాడు అవసరం లేదనుకుంటే చంద్రబాబు  ఈ విషయం చెప్పాలని… చెబితే  ఎంపీ పదవికి,పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తా అంటూ ట్వీట్ చేశారు. తనలాంటి వాళ్లు పార్టీలో కొనసాగాలంటే మీ పెంపుడు కుక్కలను అదుపులో పెట్టుకోవాలని అన్నారు.

‘‘రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు, గుళ్లో కొబ్బరి చిప్ప దొంగలకి, సైకిల్ బెల్లుల దొంగలకి, కాల్ మనీ గాళ్లకి, సెక్స్ రాకెట్ గాళ్లకి, బ్రోకర్లకి, పైరవిదారులకి అవసరం.నాకు అవసరం లేదు’’ అంటూ నాని ట్వీట్ చేశారు.

 

Latest Updates