ఓయో చేతికి కీస్ హోటల్స్..?

సాఫ్ట్‌‌‌‌బ్యాంక్‌‌‌‌ కు చెందిన ఓయో హోటల్స్‌ లాస్‌ ఏంజిల్స్‌కు చెందిన కీస్‌హోటల్స్‌‌‌‌ను దక్కించు కోవాలనుకుంటోంది. ఇందుకోసం బెర్గ్‌ ‌‌‌గ్రూన్ హోల్డింగ్స్‌తో చర్చలు జరుపుతోంది. ఆ సంస్థకు చెందిన కీస్‌ హోటల్స్‌‌‌‌ను ఇండియాలో ఓయో దక్కించుకోవాలనుకుంటోంది. బెర్గ్‌ ‌‌‌గ్రూన్  హోల్డిం గ్స్‌ను ఇండియాలో బెర్గ్‌ ‌‌‌గ్రూన్  హోటల్స్‌ నిర్వహిస్తోంది. 2006 సెప్టెంబర్‌ లో దీన్నిఏర్పాటు చేశారు. కీస్ బ్రాండ్‌‌‌ ‌కింద బిజినెస్‌ హోటల్స్‌ కార్యకలాపాలు సాగుతున్నాయి. అయితే గత రెండు లేదా మూడేళ్ల నుంచి కీస్ హోటల్స్‌ తీవ్ర నష్టాల్లో నడుస్తోంది. ఎంతో మంది సీనియర్ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు ఈ కంపెనీని వదిలేశారు. కీస్ హోటల్స్ కూడా కొన్నేళ్లనుంచి కొనుగోలుదారుని కోసం వెతుకుతోంది. ఇప్పటికే దీని అప్పు రూ.160 కోట్లకు చేరింది. మొత్తం పోర్ట్‌ ‌‌‌ఫోర్ట్‌‌‌‌ లియో హోటల్స్‌లో కీస్‌కు వెయ్యి గదులతో ఏడు హోటల్స్‌ ఉన్నాయి. మరో 13 హోటల్స్ ఫ్రాంచైజ్‌ కింద నడుస్తున్నాయి. కీ హోటల్స్‌‌‌‌ను కొనే ప్రతిపాదన విషయంలో బెర్గ్‌ ‌‌‌గ్రూన్  హోల్డింగ్స్‌‌‌‌ను ఓయో కలిసినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే ఓయోతో ఎలాంటి డీల్ చర్చలు జరుగలేదని బెర్గ్‌ ‌‌‌గ్రూన్ హోటల్స్ చీఫ్ఎగ్జి క్యూటివ్‌ అన్షు సరిన్ అన్నారు . ఓయోతో ఎలాంటి డీల్‌ కుదుర్చుకోలేదని తెలిపారు. అమెరికాలోని బెర్గ్‌ ‌‌‌గ్రూన్  హోల్డింగ్స్‌ అధికార ప్రతినిధి కూడా దీనిపై స్పందించలేదు. ఓయో కూడా ఈ ఊహాగానాలను కొట్టిపారే స్తోంది. తమ కొనుగోళ్లు తమ సామర్థ్యాలను పెంచే స్థాయిలో ఉండాలని, ఈ సమయంలో ఇక ఎలాంటి  ప్రకటనల్లేవని  ఓయో అధికార ప్రతినిధి కూడా చెప్పారు. ఓయో కో వర్కింగ్ స్పేస్ కంపెనీ ఇన్నోవ్ 8 ను రూ.200 కోట్లకు కొనుగోలు చేస్తుందని… ఈ కంపెనీతో చర్చలు కూడా అడ్వాన్స్ స్టేజీలో ఉన్నాయ ని ఈటీ రిపోర్టు చేసింది. ఓయో దగ్గర పెద్ద మొత్తంలో నగదు ఉందని, ఇది కో-వర్కింగ్, కో-లివింగ్ స్పేస్‌ల ను కొనుగోలు చేసేందుకు చూస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2018 మార్చిలో ఓయో చెన్నైకి చెందిన సర్వీస్‌ అపార్ట్‌‌మెంట్స్ కంపెనీ నోవా స్కాటియా బొటిక్‌ ‌‌‌హోమ్స్‌‌‌‌ను కొనుగోలు చేసింది. ఇది తొమ్మిది నగరాల్లో45కి పైగా సిల్వర్‌కీ బ్రాండ్‌‌‌‌తో ప్రాపర్టీలర్టీ ను నిర్వహిస్తోంది. 10 నెలల కంటే తక్కువ సమయంలోనే గదుల సంఖ్యను మూడు రెట్లు పెంచుకుంది.

Latest Updates