అమ్మాయిలతో స్నేహం చేసి రూ.7కోట్లు కొల్లగొట్టాడు

అమ్మాయిలతో స్నేహం చేసి రూ.7.2కోట్ల నగదును కొల్లగొట్టిన ఓ వ్యక్తికి ఆరేళ్ల  జైలుశిక్ష పడింది. లండన్ లోని భారత సంతతికి చెందిన కేయూర్ వ్యాస్ అనే వ్యక్తి ఇంటర్ నెట్ ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకుని తనొక బిలియనీర్ గా పరిచయం చేసుకునేవాడు. అతనికి లేని కంపెనీలను ఉన్నట్టుగా నమ్మించేవాడు. దీంతో పాటు.. తన కంపెనీలలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని వారికి చెప్పి… కుదిరితే వాళ్ళతో పెట్టుబడి పెట్టించేవాడు. ఇలా అందరి దగ్గర నుంచి 7.2 కోట్లు పెట్టుబడి రూపంలో తీసుకుపొన్నాడు.

తర్వాత మోసపోయామని తెలుసుకున్న ఒకరిద్దరు అమ్మాయిలు వ్యాస్ ను నిలదీశారు. ఎదురుతిరిగిన వ్యాస్ వాళ్లకు మనీ తిరిగి ఇవ్వక పోగా.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అసలుకే ఇవ్వనని బెధిరించాడు. దీంతో ఆ అమ్మాయిలు ఊరుకున్నారు. మరి కొందరు అమ్మాయిలు మాత్రం ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. వ్యాస్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. నాలుగేళ్లు విచారించిన కింగ్ స్టన్ క్రౌన్ కోర్టు వ్యాస్ కు ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

Latest Updates