నిజామాబాద్‌లో తొలి కేఎఫ్‌సీ రెస్టారెంట్‌

నిజామాబాద్‌: చికెన్‌ను ఇష్టపడే వారి కోసం ప్రముఖ రెస్టారెంట్ దిగ్గజ సంస్థ కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్‌సీ) ఇండియా.. నిజామాబాద్ లో త‌మ మొదటి రెస్టారెంట్‌ను ప్రారంభించింది. న‌గ‌రంలోని ప్రగతి నగర్‌ వేణు మాల్‌లో ఏర్పాటు నాన్ వెజ్ ప్రియుల అభిరుచి మేరకు ప‌లు రకాల చికెన్ ఐట‌మ్స్ ను అందుబాటులో ఉంచింది. ప్ర‌తి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు క‌స్ట‌మ‌ర్లు త‌మ‌కు ఇష్టమైన కెఎఫ్‌సి ఫేవరెట్స్, వివిధ రకాల ఆహార పదార్థాలను డెలివరీ, టేక్‌ఎవే, మీ కారు/బైకు వద్దకే కెఎఫ్‌సి విధానాల్లో అందుకొని ఆస్వాదించేలా అన్ని ఏర్పాట్లు చేసింది. అదే విధంగా ఆన్‌లైన్‌లో కెఎఫ్‌సి యాప్ ద్వారా లేదా కెఎఫ్‌సి వెబ్‌సైట్ లేదా మొబైల్ సైట్ (www.kfc.co.in)లో ఆర్డర్ చేసుకునేలా అన్ని స‌దుపాయాలు ఉన్న‌ట్లు రెస్టారెంట్ యాజ‌మాన్యం ఈ మేర‌కు తెలిపింది.

Latest Updates