హైద‌రాబాద్‌లో రూ. 35కే కిలో ఉల్లిగ‌డ్డ‌

హైదరాబాద్ : భారీగా పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కేంద్రం ఉల్లి నిల్వలపై ఆంక్షలు విధించింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాయితీపై ఉల్లి సరఫరా చేస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లోని 11 రైతు బజార్లలో 35 రూపాయలకు కిలో ఉల్లిగడ్డలు అందించడానికి మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేసింది. ప్రతి వ్యక్తికి 2 కిలోల చొప్పున ఉల్లి విక్రయిస్తామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఉల్లిగడ్డలు తీసుకోవచ్చని చెప్పారు.

Latest Updates