KGBV ల్లో కాంట్రాక్టు పోస్టులు: చివరి తేదీ 23

school
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV)/అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల్లో కాంట్రాక్టు పద్ధతిలో టీచర్‌ పోస్టులను భర్తీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి  శనివారం(జూన్ -16) ప్రకటన విడుదల చేసింది. పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 20 నుంచి 23న సాయంత్రం 5 గంటల లోపు ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. తమ వెబ్‌సైట్‌ ssa. telangana.gov.inలో దరఖాస్తులను పంపాలని తెలిపారు. విద్యార్హతలు, రాత పరీక్ష విధానం, సిలబస్ కు సంబంధించిన సమాచారం వెబ్‌సైట్‌లో ఈ నెల 16 నుంచి అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

విద్యాలయాలు/అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో కాంట్రాక్టు రెసిడెన్స్‌ టీచర్‌(CRT), స్పెషల్‌ ఆఫీసర్‌(SO), ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌(PET) పోస్టులను, ఈ అకాడమిక్ ఇయర్ జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ అయిన 87 కస్తూర్బా గాంధీ కాలేజీల్లో పోస్టుగ్రాడ్యుయేట్‌ కాంట్రాక్ట్‌ రెసిడెన్స్‌ టీచర్‌(PGCRT) పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 1050 ఖాళీలున్నాయని, ఇందులో PGCRT పోస్టులు 580, CRT 359, SOలు 49,PETలు 62 ఉన్నాయని తెలిపారు. SOలకు రాత పరీక్ష జూలై 2న, PGCRT  పరీక్ష 3న, CRT, PETల రాత పరీక్ష 4న ఉంటాయన్నారు. అయితే KGBVల్లో మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates