కె.జి.యఫ్‌ . చాప్టర్ 2 ఫస్ట్‌లుక్ అదుర్స్

అద్భుతమైన కథ, కథనాలతో సంచలన విజయం సాధించింది ‘కె.జి.యఫ్‌ . చాప్టర్ 1’. ట్రెండ్ సెట్టర్‌‌‌‌గా నిలవడమే కాదు.. కలెక్షన్లు కురిపించింది. విజువల్‌ ఎఫెక్స్ట్ , స్టంట్స్‌‌ విభాగాల్లో ఈ ఏడాది జాతీయ అవార్డుల్ని సైతం సొంతం చేసుకుంది. అందుకే చాప్టర్ 2పై అందరికీ అమితాసక్తి ఉంది. యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అధీరా పాత్రలో సంజయ్‌ దత్‌‌ నటించడం సినిమాకి మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్‌‌ బ్యానర్‌‌పై విజయ్‌ కిరగందూర్‌‌ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాప్టర్ 1 విడుదలై సంవత్సరం పూర్తయిన సందర్భంగా చాప్టర్ 2 ఫస్ట్ లుక్‌‌ను శనివారం విడుదల చేశారు. సినిమాలోని ఇంటెన్సిటీని ఈ పోస్టర్‌‌‌‌ కళ్లకు కడుతోంది. ఎక్స్‌‌పెక్టేషన్స్‌‌ను పెంచుతోంది. రాకీ భాయ్‌‌గా యశ్‌ మరోసారి రాక్‌‌ చేస్తే చూడాలని అందరికీ ఉంది. కానీ అందుకు వచ్చే యేడు ద్వితీయార్థం వరకు వెయిట్ చేయాల్సిందే.

Latest Updates