కేజీఎఫ్-2 టీజర్ రిలీజ్.. అధీరాను ఢీకొనడానికి రాకీ భాయ్ రెడీ

బెంగళూరు: ప్రేక్షకులను ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న కేజీఎఫ్: చాప్టర్-2 టీజర్ రిలీజైంది. ఫ్యాన్స్ ఆశలకు ఏమాత్రం తీసిపోని విధంగా నెక్స్ట్ లెవల్‌‌లో ఈ టీజర్ ఉండటం విశేషం. చాప్టర్-2లో కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ రవీనా టండన్ టీజర్‌‌లో ఆకట్టుకుంది.  అలాగే విలన్‌‌ అధీరాగా యాక్ట్ చేస్తున్న ఖల్‌‌నాయక్‌ సంజయ్ దత్ టీజర్‌‌లో కత్తితో నిలబడిన తీరు కట్టిపడేసిందనే చెప్పాలి. తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రమేశ్ కూడా టీజర్‌‌లో కనిపించాడు. చివర్లో హీరో యశ్ మిషన్ గన్‌తో జీపు‌‌లను పేల్చే సీన్ సూపర్బ్‌‌గా ఉందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఈ టీజర్ అధికారికంగా రిలీజ్ అవ్వడానికి ముందే గురువారం రాత్రి సోషల్ మీడియాలో లీకయ్యింది. శుక్రవారం ఉదయం 10:18కి టీజర్ రిలీజ్‌‌కు మూవీ టీమ్ ప్లాన్ చేసింది. కానీ లీకవ్వడంతో సినీ టీమ్ కూడా ముందే విడుదల చేయాల్సి వచ్చింది. ఈ విషయంపై ‘మీరు హ్యాక్ చేయొచ్చు. లీక్ కూడా చేయొచ్చు. మీరు లక్ష్యాన్ని ముందే చేరుకోవచ్చు. కానీ నిజాయితీ కలిగిన వ్యక్తులే పెద్ద విజయాలు సాధిస్తారు. రాకీ భాయ్ ఎప్పుడూ గెలుస్తాడు’ అని కేజీఎఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గౌడ ట్వీట్ చేశారు.

Latest Updates