కేజీఎఫ్ డైరెక్టర్ తో ప్రభాస్..!?

ప్రభాస్ ఖ్యాతిని ప్యాన్ ఇండియా స్థాయికి పెంచింది ‘బాహుబలి’. ఈ సిరీస్ లో వచ్చిన ‘బాహుబలి 2’ విడుదలై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభాస్ ట్వీట్ చేస్తూ… ‘నా కెరీర్‌లో మరిచిపోలేని బిగ్గెస్ట్  హిట్ ఇచ్చిన అభిమానులకు, రాజమౌళికి, చిత్ర యూనిట్కు ప్రత్యేక కృతజ్ఞ తలు’ అంటూ పోస్ట్ చేశాడు. బాహుబలి సిరీస్ తర్వాత భారీ బడ్ట్ సినిమాలు మాత్రమే చేస్ జె తున్న ప్రభాస్.. ప్రస్తుం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఇది ప్రభాస్కు 20వ సినిమా కాగా.. 21వ చిత్రం ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానుంది. ఈ భారీ బడ్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీని జె అశ్వినీదత్ నిర్మించనున్నారు. తాజాగా ప్రభాస్ 22వ చిత్రం కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. ‘బాహుబలి’ తర్వాత దక్షిణా ది నుండి ప్యాన్ ఇండియా స్థాయిలో మెప్పించిన సినిమా ‘కేజీఎఫ్‌’. ఈ సినిమాతో మన టాలీవుడ్ స్టార్ స్ చూపు ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై  పడింది. ఎన్టీఆన్టీ ర్, మహేష్ బాబు మొదలు పలువురు స్టార్ హీరోలు ప్రశాంత్ తో  సినిమాలు చేసేందుకు ఆసక్తి చూ పిస్తున్నారు. అయితే ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉండటం, మరోవైపు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ 2’ చేస్తుండడంతో ఆ కాంబినేషన్స్ ముందుకు కదలలేదు. కానీ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్,- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రశాంత్కు అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో  ఉంటుందని గత కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. కానీ అది ప్రభాస్‌తో ఫిక్సయ్యిం దని తాజా సమాచారం. హీరో ఎవరైనా హీ రోయిజాన్ని ఎలివేట్ చేయడంలో రాజమౌళికి ఏమాత్రం తగ్గడు ప్రశాంత్ నీల్. అతని సక్సెస్ సీక్రెట్ కూడా అదే. మరి మన బాహుబలి స్టార్ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి!

Latest Updates