ఖైరతాబాద్ మహాగణపతి..కర్ర పూజ

వినాయక చవితి అనగానే రాష్ట్ర ప్రజలకు గుర్తొచ్చేది హైదరాబాద్ ఖైరతాబాద్ గణేషుడు. ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది భక్తులను అనుగ్రహించేందుకు సిద్దమవుతున్నాడు పెద్ద గణపయ్య. ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర మహా గణనాథుడి విగ్రహ నిర్మాణ పనులు కర్ర పూజతో ప్రారంభమయ్యాయి. 65వ ఏట అడుగు పెడుతున్న వినాయకుడి ఎత్తు, పేరు మరికొద్ది రోజుల్లో ఖరారు కానుంది.

దాదాపు నాలుగు నెలల పాటు విగ్రహ తయారీ పనులు జరగనున్నాయి. శిల్పి రాజేంద్రన్‌తో పాటు 120 మంది కళాకారులు విగ్రహాన్ని తయారు చేయనున్నారు. ఈ ఏడాది 58 నుంచి 60 అడుగుల ఎత్తులో విగ్రహం నిర్మాణం జరిగే అవకాశం ఉంది. ఈ సారి ఎత్తు తగ్గించమని విజ్ఞప్తులు వస్తున్న క్రమంలో త్వరలో ఉత్సవ కమిటీ విగ్రహ నమూనా, ఎత్తు వివరాలను ఇంకా ఖరారు చేయలేదని తెలిపింది.15 రోజుల తర్వాత వినాయక విగ్రహం తయారీ పనులు ప్రారంభం కానున్నాయి.

Latest Updates