బైబై గణేశా.. పూర్తయిన ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం

ఖైరతాబాద్  మహాగణపతి నిమజ్జన కార్యక్రమం పూర్తయింది. ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 6 దగ్గర నిమజ్జనం చేశారు. 50 టన్నులకు పైగా బరువున్న విగ్రాహాన్ని  నిమజ్జనం చేయడానికి ప్రత్యేక క్రేన్ ను ఏర్పాటు చేశారు.  ఆరుగంటలకు పైగా మహా గణనాథుడి  శోభాయాత్ర జరిగింది. ఆ మహా గణనాథుడిని చూడటానికి భక్తులు భారీగా తరలి రావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.  ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రోహంగా మారాయి.  ఎన్టీఆర్ మార్గ్‌ వైపు నిమజ్జనానికి వచ్చే వినాయకులను ట్యాంక్ బండ్ వైపు మళ్లించారు అధికారులు.

Latest Updates