12 న శోభాయాత్ర నిమజ్జనోత్సవం

  • ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్​ గణేశ్ ​శోభాయాత్ర
  • 10.30 గంటలకు హుస్సేన్ ​సాగర్​లో నిమజ్జనం
  • 8 గంటలకు బాలాపూర్ లడ్డూ వేలం
  • 11న ట్యాంక్‌‌ బండ్‌‌పై గంగా హారతి
  • వివరాలు వెల్లడించిన ఉత్సవ సమితి

సిటీలో గణేశ్​ శోభా యాత్ర, నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నిమజ్జనోత్సవానికి ముందు రోజు గంగా హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 12న ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్​ మహా గణపతి బయలు దేరతాడు. 10.30కి నిమజ్జనం ఉంటుంది. అదేరోజు ఉదయం 8 గంటలకు బాలాపూర్​ గణపతి లడ్డూ వేలం ఉంటుంది.  – హైదరాబాద్​, వెలుగు

గణేశ్​ నిమజ్జనోత్సవాలకు సర్వం సిద్ధం,గా ఉందని భాగ్యనగర్​గణేష్ ఉత్సవ సమితి తెలిపింది. ఈ నెల 12న నిర్వహించే నిమజ్జనోత్సవ వివరాలను శుక్రవారం మీడియాకు తెలిపింది. భాగ్యనగర్​గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్​ రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్సవాలకు బల్దియా కమిషనర్​ నోడల్ ​ఆఫీసర్​గా ఉంటారన్నారు. మెట్రో, వాటర్ వర్క్స్, జీహెచ్​ఎంసీ, పోలీసులు, ఆర్​టీవో సిబ్బంది విధుల్లో పాల్గొంటారని తెలిపారు.

సెప్టెంబర్​ 12న ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్​ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమై 10.30కి నిమజ్జనం జరుగుతందన్నారు. తర్వాత 8గంటలకు బాలాపూర్​లోని  ప్రధాన గణపతి లడ్డూ వేలంతో శోభాయాత్ర స్టార్ట్​ అవుతుందన్నారు. షాలిబండ, చార్మినార్​ మీదుగా ఈ గణపతి టాంక్​బండ్​ చేరుకుంటాడన్నారు. టాంక్​బండ్​పై 11న గంగా హారతి కార్యక్రమం ఉంటుదన్నారు.  నిమజ్జనోత్సవాలకు ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​, ప్రజ్ఞ మిషన్​వ్యవస్థాపకుడు స్వామి ప్రజ్ఞానాజి హాజరవుతారన్నారు.సుమారు 30 నుంచి 40 లక్షల భక్తులు వస్తారని అంచానా వేస్తున్నట్టు తెలిపారు.

సిటీలో లక్షకు పైగా విగ్రహాలున్నాయని, 32 చెరువుల్లో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. 8 నుంచి 10వ తేదీ దాకా భజన పోటీలు ఉంటాయన్నారు. 8న మీరాలం మండి, ఖైరతాబాద్​, కార్వాన్​, కాచిగూడ, బాలాపూర్​ సర్కిళ్లలో.. ఫైనల్​ పోటీలు 10న రవీంద్రభారతిలో నిర్వహిస్తామన్నారు. వివరాలకు 99080 06662, 040–24740044 నంబర్లను సంప్రదించాలని సూచించారు. విలేకరుల సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్​రాఘవరెడ్డి, వైస్​ ప్రెసిడెంట్లు​ రామరాజు, కృష్ణారెడ్డి, సెక్రెటరీలు మహేందర్​, శశిధర్​ పాల్గొన్నారు.

Khairathabad ganesh immersion on 12th september in Hyderabad city

Latest Updates