సిద్ధమైన ఖైరతాబాద్ గణేశ్.. సోమవారం తొలిపూజ

హైదరాబాద్ ఖైరతాబాద్ గణనాథుడు పూజలకు సిద్ధమయ్యాడు. ఈ సారి ద్వాదశ ఆదిత్య మహాగణపతి అలంకారంలో దర్శనమివ్వనున్నాడు మహాగణపతి. 61 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో గణపతిని తయారు చేయించారు గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులు.

మహా గణపతి విగ్రహ పనులన్నీ ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. పండక్కి ముందే భారీ వినాయకుడిని చూసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. సోమవారం ఉదయం తొలి పూజ జరగనుంది.

వినాయకచవితికి ముందే భక్తులు ఎక్కువగా ఖైరతాబాద్ కు వస్తుండటం.. వీకెండ్ కావడంతో.. ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటుచేశారు పోలీసులు. బారికేడ్లు పెట్టి.. భక్తులను క్యూలో దర్శనానికి అనుమతిస్తున్నారు. వాహనాలు నడిపేవారు.. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు.

Latest Updates