శ్రీద్వాదశాదిత్య మహాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు

ఖైరతాబాద్‌‌: దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ మహా వినాయకుడు ఈసారి శ్రీద్వాదశాదిత్య మహాగణపతిగా దర్శనమివ్వనున్నారు. ఖైరతాబాద్‌ వినాయకుడి నమూనాను మంగళవారం ఉత్సవ కమిటీ సభ్యులు విడుదల చేశారు. ఈ ఏడాది ‘శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి’ పేరుతో విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్‌ గణేశ్ మండపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహ నమూనాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విగ్రహానికి సంబంధించిన వివరాలను తెలిపారు.

వినాయకుడి ప్రత్యేకతలు

-ఈసారి మహాగణపతి విగ్రహాన్ని 61 అడుగుల ఎత్తు

-28 అడుగుల వెడల్పు

– విగ్రహం ముఖ భాగం సూర్యుడిని పోలి ఉంటుంది.

-విగ్రహానికి 12 తలలు, 24 చేతులు, 12 సర్పాలు, 7 గుర్రాలు ఉంటాయి.

-విఘ్నేశ్వరుడికి కుడి, ఎడమ భాగాల్లో సిద్ధ కుంజిగాదేవి, దత్తాత్రేయ విగ్రహానికి కుడివైపున గల చిన్న మండపంలో  మహావిష్ణువుతో పాటు ఏకాదశా దేవి విగ్రహం.

-ఎడమవైపున మహాకాళితో పాటు త్రిమూర్తుల విగ్రహం

– విగ్రహాలను 16 అడుగుల పొడవుతో నిర్మించనున్నారు.

Latest Updates