లండన్ లో అదృశ్యమైన బీజేపీ నేత కుమారుడు

khammam-bjp-leaders-son-missing-in-london

ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సన్నె ఉదయ్ ప్రతాప్ కొడుకు హర్ష లండన్ లో పీజీ చదువుతున్నాడు. అయితే హర్ష శుక్రవారం మధ్యాహ్నం నుంచి కన్పించడం లేదు. దీంతో  అతనిపై లండన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. విషయం తెలిసిన ఉదయ్‌ప్రతాప్‌ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. పీజీ కోర్సు చదువుతున్న హర్ష కనిపించకుండా పోయాడని హాస్టల్‌ నిర్వాహకులు అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఖమ్మంలోని అతడి తల్లిదండ్రులకు శుక్రవారం అర్థరాత్రి సమాచారమిచ్చారు.

విషయం తెలుసుకున్న ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఫోన్‌లో ఉదయ్‌ప్రతాప్‌తో మాట్లాడారు. లండన్‌లోని దౌత్య అధికారులతో మాట్లాడి హర్ష ఆచూకీ కనుక్కునేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విదేశాంగ శాఖతో పాటు … లండన్‌లో ఉన్న తెలుగు వాళ్లతో తాను మాట్లాడతాననీ… ప్రత్యేకంగా కేంద్రానికి లెటర్ రాసి… హర్ష ఆచూకీ తెలుసుకోవడానికి తన వంతు సహకారం అందిస్తానని నామా భరోసా ఇచ్చారు.

Latest Updates