ఖమ్మం కార్పొరేషన్: టిక్ టాక్ వీడియోలతో ఉద్యోగులు బిజీ

khammam-corporation-employees-enjoying-with-tik-tok-videos-in-office

ఖమ్మం కార్పొరేట్ సిబ్బంది ప్రజల సమస్యలను పక్కకుపెట్టి టిక్ టాక్ వీడియోలతో ఎంజాయ్ చేస్తున్నారు. కార్పొరేషన్ లోని ఔట్ సోర్సింగ్ విభాగాల్లో పని చేస్తున్న జ్యోతి, అనిత, రవి తదితరులు విధులను మానేసీ వీడియోలతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ విషయంలో ఇదివరకే ఉన్నతాధికారులు వీరికి నోటీసులు జారీ చేశారు. అయినా మారక పోవడంతో పది మందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఖమ్మం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు.

ఖమ్మం కార్పొరేషన్ లో పని చేస్తున్న కొందరు అవుట్ సోర్సిం గ్ సిబ్బంది డ్యూటీని పక్కనపెట్టి టిక్ టాక్ వీడియోలు  చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. పనులు మానేసి పాటలు, డ్యాన్సులు, డైలాగులు చెప్పుకుంటూ వీడియోలు తీస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదాస్పదంగా మారాయి. పనుల కోసం వచ్చే ప్రజలకు సేవలందించాల్సింది పోయి టిక్ టాక్ లో మునిగిపోవడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టారు.

ఆఫీసులోనే దర్జాగా..
ఖమ్మం కార్పొరేషన్‍ ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది. ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో అధికార యంత్రాంగంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అయినా ఉద్యోగుల తీరు మారకపోగా టిక్ టాక్ లు చేస్తూ ప్రజాగ్రహానికి గురవుతున్నారు. కార్పొరేషన్ కు నిత్యం వందల సంఖ్యలో జనం వస్తూ, పోతూ ఉంటారు. వారు నెత్తి నోరు కొట్టు కున్నా పని చేయని ఉద్యోగులు టిక్ టాక్ లు, వీడియోలకు మాత్రం సమయాన్ని వెచ్చిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. గతంలో వీరి ప్రవర్తనపై పలు మార్లు ఆరోపణలు రావడంతో గతంలో పని చేసిన కమిషనర్లు ఉద్యోగాల నుంచి పలువురిని తొలగించారు. అయినా వీరి పద్ధతిలో మార్పు రాలేదు.

పని వేళల్లోనే
ఖమ్మం కార్పొరేషన్ లోని ట్రేడ్ సెన్స్ ల విభాగంలో పని చేస్తున్న ఓ అవుట్ సోర్సిం గ్ శానిటేషన్ వర్కర్‍ జ్యోతి, శ్రీదేవి, ఇంజినీరిం గ్ విభాగంలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్‍ఉద్యోగులు అనిత, వీరన్న, వంశీ, ప్రవీణ్‍, రవి, శంకర్‍, ఉపేం దర్‍  తదితరులు కొంత కాలంగా డ్యూటీని పక్కన పెట్టి ఎంఈ ఆఫీసులో ఏసీలు ఆన్ చేసుకొని తలుపులు వేసుకొని ఆఫీసు వేళల్లోనే టిక్ టిక్ లతో ఎంజాయ్ చేస్తున్నారు. వారి విషయాన్ని ఆఫీసర్లు కూడా గ్రహించకపోవడంతో వారు ఆడిందే ఆటగా సాగింది. గతంలో జ్యోతి, శ్రీదేవిపై ఫిర్యాదులు రావడంతో అప్పటి కమిషనర్‍ ఉద్యోగాల నుంచి తొలగించారు. అయినప్పటికీ కార్పొరేటర్ల పైరవీలతో తిరిగి మళ్లీ ఉద్యోగాల్లో చేరారు. వీరిపై ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.

ఇటీవల శ్రీదేవిపై ఫిర్యాదులు రావడంతో ఆమె పని చేస్తున్న విభాగం మార్చారు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోగా ఇంకా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. వ్యాపారస్తులు ట్రేడ్ సెన్స్ ల కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నా వారు మాత్రం వీడియోల్లో మునిగి తేలుతున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో కోట్లాది రూపాయల పనులు జరుగుతుంటాయి. దీనికి సంబంధించి ఎంబీలు నమోదు చేయడం, బిల్లులు తయారు చేయడం వంటి పనులు డీబీ సెక్షన్ నుంచి జరుగుతుంటాయి . ఈ సెక్షన్ లో పని చేస్తున్న నలుగురు అవుట్ సోర్సిం గ్ ఉద్యోగులు పనులు పక్కన పడేసి కాలక్షేపం చేస్తున్నారు. బిల్లుల కోసం తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. టిక్ టాక్ లు చేసుకోవాలంటే బయట చేసుకోవాలని, ఆఫీసులో ఇదేం పనని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అవాక్కైన ఉన్నతాధికారులు
ఆఫీసులో నగర మేయర్ పాపాలాల్‍, కమిషనర్ జే. శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ జగన్ , ఎంఈ రంజిత్ కుమార్‍ చాంబర్లు ఉన్నాయి. వీరితోపాటు కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు సైతం వారి వారి పనుల కోసం ప్రతి రోజూ ఆఫీసుకు వస్తూపోతూ ఉంటారు. సిబ్బంది వారిని పట్టించుకోకుండా ఏకంగా ఎంఈ గదిలోనే టిక్ టిక్ లు చేయడం గమనార్హం.

సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు
ఖమ్మం కార్పొరేషన్ లో టిక్ టాక్ వీడియోలు చేస్తున్న సిబ్బందిపై కమిషనర్‍ జే.శ్రీనివాసరావు క్రమశి క్షణా చర్యలు చేపట్టారు. డ్యూటీని నిర్లక్ష్యం చూస్తూ టిక్ టాక్ తో కాలక్షేపం చేస్తున్న వారందరినీ కమిషనర్ శానిటేషన్‍ విభాగానికి పంపించారు. నేటి నుంచి నగరంలోని పలు డివిజన్లలో శానిటేషన్ డ్యూటీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Latest Updates