ఆసక్తికరంగా మారిన ఖమ్మం జిల్లా రాజకీయాలు

ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దమ్మాయిపేట మండలం గందుగులపల్లిలోని తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లారు మంత్రి పువ్వాడ అజయ్. ఆయన వెంట ఎంపీ, టీఆర్ఎస్ లోక్ సభాపక్షనేత నామా నాగేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు కూడా ఉన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వర్గం ప్రజాప్రతినిదులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నష్టపోయిన వారిని ఎలా కాపాడుకోవాలో తెలియని అసమర్థుడిని కానన్నారు.

తనవారిని ఇబ్బంది పెట్టినవారు ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రజాభిమానమే తనకు చాలా పెద్ద పదవి అని, పదవి రావాలనుకున్నప్పుడు ఎవరు అడ్డుపడినా ఆగదన్నారు. పదవి పోయేటప్పుడు కాంక్రీట్  గోడలు కట్టినా లాభం ఉండదని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇవాళ ఖమ్మంలో టీఆర్ఎస్ నేతల భేటీ ఆసక్తికరంగా మారింది.

Latest Updates