మిస్సింగ్ కేసు : లండన్ బీచ్ లో శవమై తేలిన ఖమ్మం యువకుడు

లండన్ లో ఆగస్టు- 21న కనిపించకుండా పోయిన ఖమ్మం యువకుడు ఉజ్వల్  శ్రీహర్ష మృతదేహాన్ని అక్కడి బీచ్ లో గుర్తించారు పోలీసులు. శ్రీహర్ష కనిపించడం లేదంటూ అక్కడి పోలీసులకు 12 రోజులు కింద ఫిర్యాదు చేశారు అతడి స్నేహితులు. అయితే బీచ్ లో శ్రీహర్ష డెడ్ బాడీని గుర్తించిన పోలీసులు…అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. లండన్ వెళ్లిన శ్రీహర్ష తండ్రి మృతుడి దుస్తులు, పర్స్ అధారంగా గుర్తించారు. దీంతో మృతుడి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Latest Updates