ఖేలో ఇండియా మొబైల్ యాప్ లాంఛ్

దేశవ్యాప్తంగా టాలెంట్ ఉన్న ప్లేయర్లను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా  మొబైల్ యాప్ ను లాంచ్ చేసింది.  యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ లో భాగంగా ఇవాళ ఢిల్లీలో స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన ఖేలో ఇండియా యాప్‌ను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. యువతకు క్రీడల అవసరం, ఫిట్‌నెస్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ఈ యాప్‌ను రూపొందించారు. రానున్న రోజుల్లో భారత్ క్రీడల్లో మరింతగా అభివృద్ధి చెంది..అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ఈ యాప్ ఉపయోగపడనుంది. ఈ యాప్‌లో 3 ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

18 రకాల క్రీడలకు సంబంధించి నియమనిబంధనలు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో క్రీడలపట్ల ఆసక్తి ఉన్న వ్యక్తుల డాటా సేకరణ, వివిధ క్రీడల కోసం ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు, ప్లేయర్లకు ఫిట్‌నెస్ గురించి అవగాహన కల్పించడం మొబైల్ లో మూడు ఫీచర్లలో అందుబాటులో ఉన్నాయి. కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌తోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్  లో ఈ యాప్ అందుబాటులో ఉంది.

Latest Updates