నన్ను క్షమించండి..నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు

తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా నేత కుష్బు క్షమాపణలు చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కుష్బు ఈ నెల 14 చెన్నైకి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానసిక ఎదుగుదల లేని పార్టీ కాంగ్రెస్‌ అని, ఆ పార్టీ నాయకులకు బుర్ర కూడా తక్కువే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ  వ్యాఖ్యలు తమిళనాడులో వివాదాస్పదమయ్యాయి. కుష్భు చేసిన వ్యాఖ్యలపై  తమిళనాడులోని ఓ హక్కుల సంస్థ 30 పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేసింది.

అయితే ఈ వివాదంపై కుష్బు స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తానని అన్నారు.

ఇక కాంగ్రెస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి కారణం  తీవ్ర దుఖం, వేదనేనని చెప్పారు. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఈ స్థాయిగా ఎదిగిన తాను  వేరే వాళ్ల డైరెక్షన్‌లో.. వారి ఆలోచనల మేరకు మాట్లాడుతున్నానని అనడం కరెక్ట్ కాదన్నారు బీజేపీ నేత కుష్బు.

Latest Updates