
గ్లోబల్ మార్కెట్లో దూసుకెళ్లడమే టార్గెట్ గా పెట్టుకున్న కియా కార్పొరేషన్
కియా కంపెనీ లోగో మారింది. భవిష్యత్ లో గ్లోబల్ మార్కెట్లో లీడర్ గా అవతరించడమే లక్ష్యంగా పెట్టుకుని సరికొత్త వ్యూహాలతో దూసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా లోగోను మార్చేసింది. అలాగే కంపెనీ పేరులో నుంచి మోటార్స్ అనే పదాన్ని తొలగించి కియా కార్పొరేషన్ గా మార్చింది. భవిష్యత్తులో డిజిటల్ విప్లవం రానుందని అంచనా వేస్తున్న కియా.. తమ సేవలు.. ఉత్పత్తులు అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. కియా మోటార్స్ కొత్త లోగో చేతితో రాసిన సంతకాన్ని పోలి ఉంది. లోగో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడా లైన్ బ్రేక్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు కలిపి ఉంచుతూ సరికొత్తగా డిజైన్ చేసింది. భవిష్యత్ వ్యూహంలో భాగంగా కొత్త బ్రాండ్‌ను ప్రారంభించామని, ఈ లోగో తమ లక్ష్యాన్ని, శ్రమను సూచిస్తుందని కియా కార్పొరేషన్ అధ్యక్షుడు, సీఈఓ హొ సంగ్ సాంగ్ ఓ వీడియోలో వివరించారు. పరిశ్రమలో లీడర్ గా అవతరించాలంటే వ్యూహాలను మార్చుకోకతప్పదంటూ తన కొత్త కార్పొరేట్ లోగో మరియు గ్లోబలర్ బ్రాండ్ నినాదాన్ని ఆవిష్కరించారు. కొత్త లోగో పరిచయం తన వ్యాపారం యొక్క దాదాపు అన్ని కోణాలను పునరుద్ధరించుకోవాలని భావిస్తున్నామన్నారు. కియా లోగో నిబద్దతను కూడా సూచిస్తుందని. కియా కంపెనీ అధ్యక్షుడు మరియు సీఈవో హో సుంగ్ సాంగ్ చెప్పారు. ఆటోమోటివ్ పరిశ్రమలో మార్పులు వేగంగా జరిగిపోతున్నాయని.. కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ కస్టమర్ల అవసరాలు తీర్చడం ద్వారా వారిని ఆకట్టుకోవడమే లక్ష్యంగా దీర్ఘకాలిక వ్యూహంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రపంచ కార్ల మార్కెట్లో ప్రముఖ స్థానాన్ని పొందడమే లక్ష్యంగా సేవలు కల్పిస్తామని ఆయన వివరించారు.
లోగో మార్పు ఉద్దేశాలను వివరిస్తున్న కియా సీఈఓ..
for more news..
గాలిపటం కోసం పరిగెడుతూ..పెంటకుప్పలో పడి బాలుడి మృతి