ఎస్ యూవీ సోనెట్ ను ఆవిష్క‌రించిన కియో మోటార్స్

ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ లో ఉన్న కియా మోటార్స్ ఎస్ యూవీ సోనెట్ ను ఆవిష్క‌రించింది. ఇంటిలిజెంట్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్ డిజైన్‌, టెక్నిక‌ల్ , డైనమిక్స్‌ మరియు భద్రతలో రికార్డ్ ను క్రియేట్ చేస్తూ ఎస్ యూవీ సోనెట్ ను కియో మోటార్స్ అందుబాటులోకి తెచ్చింది.

సెల్టోస్‌ తరువాత క‌ష్ట‌మ‌ర్ల‌కోసం కియా ఇండియా 30కు పైగా అత్యుత్తమ ఫీచర్లు మరియు వాయిస్‌ అసిస్ట్‌ సహా 57 యువీఓ కనెక్ట్‌ ఫీచర్లు, డిఎన్‌ఏ బోల్డ్‌ మరియు విలక్షణమైన డిజైన్ ల‌తో ఆక‌ర్షిస్తుంది.

ఎస్ యూవీ సోట్ విభాగంగా మొట్ట‌మొద‌టిసారిగా స్పోర్టీ జీటీ–లైన్ పీచ‌ర్స్ ను అందిస్తుంది.కియా విడుద‌ల చేసిన సోనెట్ కియా సరికొత్త అర్బన్‌ కంపాక్ట్‌ ఎస్‌యువీగా నిలుస్తుంది. అంతేకాదు, సెల్టోస్‌ తరువాత కియా విడుదల చేసిన స్వదేశీ వాహ‌నంగా నిలుస్తోంది.

ఉత్పత్తికి సిద్ధమైన ఈ మోడల్ ఫిబ్ర‌వ‌రి నెల‌లో జ‌రిగిన ఢిల్లీ ఆటో ఎక్స్ పో లో సోనెట్ వెహిక‌ల్ విడుద‌ల గురించి కియో అనౌన్స్ చేసింది. త్వరలోనే భారత్ లో ఈ కారు అమ్మ‌కాలు ప్రారంభం కానున్న‌ట్లు కియో మోటార్స్ సీఈఓ హో సంగ్ సాంగ్ తెలిపారు.

ఈ సంద‌ర్భంగా హో సంగ్ సాంగ్ మాట్లాడుతూ వెహిక‌ల్ విడుద‌లపై ఆనందం గా ఉన్నట్లు తెలిపారు. దేశంలో సెల్టోస్‌ మరియు కార్నివాల్ విజయం తరువాత, వినియోగ‌దారుల అవ‌స‌రాల్ని కియో మోటార్స్ సోనెట్ నెర‌వేర్చుతుంద‌ని తెలిపారు.

Latest Updates