‘సోనెట్’ ఫోటోల‌ను విడుద‌ల చేసిన కియా మోటార్స్ ఇండియా

న్యూఢిల్లీ: ప్ర‌ముఖ కార్ల సంస్థ‌ కియా మోటార్స్‌ ఇండియా తాము త్వరలో మార్కెట్‌లో విడుదల చేయనున్న కియా సోనెట్ కారు యొక్క ఫోటోల‌ను విడుద‌ల చేసింది. ఆగస్టు 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తొలిసారిగా విడుదల చేయనున్న ఈ కారు యొక్క ఎక్స్‌టీరియర్‌ మరియు ఇంటీరియర్‌ చిత్రాలను గురువారం అధికారికంగా విడుదల చేసింది.

యువతరం అభిరుచులను దృష్టిలో పెట్టుకుని కారు కంపాక్ట్‌ ఎస్‌యూవీని రూపొందించిన‌ట్టు కియా డిజైన్‌ సెంటర్‌ – కియా మోటార్స్‌ కార్పోరేషన్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ హెడ్ కరీమ్‌ హబీబ్ తెలిపారు. వినూత్నమైన స్పోర్టీ యాటిట్యూడ్‌, డైనమిక్‌ సిల్‌హ్యుటీతో అందిస్తున్నామ‌ని అన్నారు. విభిన్నమైన రంగుల్లో, మాన్యువల్‌ ట్రాన్సిమిషన్ తో ప్రత్యేక మైన ఫీచర్లు ఈ కారులో ఉంటాయ‌ని చెప్పారు.

క్లచ్‌లెస్‌ మాన్యువల్‌ ట్రాన్సిమిషన్ ఈ కారు ప్ర‌త్యేక‌త అని చెప్పారు. 10.25 అంగుళాల హెచ్‌డీ టచ్‌స్ర్కీన్, ‌ యువీఓ కనెక్టడ్‌ టెక్నాలజీస్ నేవిగేషన్ సిస్ట‌మ్‌, ‌భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఇంకా మ‌రెన్నో ఫీచ‌ర్స్ ఉంటాయ‌ని చెప్పారు. ఈ కారు యొక్క ధ‌ర‌ రూ.8 లక్షల నుంచి రూ.13 లక్షలు వ‌ర‌కు ఉంటుంద‌ని తెలిపారు.

 

Latest Updates