
పిల్లల్ని హెయిర్ కట్ కోసం సెలూన్ షాపుకి తీసుకెళితే ముప్పుతిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తారు. అయితే ఒక్కోసారి హెయిర్ కట్ చేసే సమయంలో పిల్లలు చేసే అల్లరి, ఏడుపులు ఎంత క్యూట్ గా ఉంటాయో మనకు తెలియంది కాదు.
తాజాగా నాగపూర్ కు చెందిన తండ్రి అనుప్ తన కొడుకు అనుశ్రుత్ కు హెయిర్ కట్ చేయించేందుకు సెలూన్ షాపుకి తీసుకెళ్లాడు. బార్బర్..,అనుశ్రుత్ కు కటింగ్ చేస్తుండగా నానా హంగామా చేశాడు ప్రస్తుతం ఆవీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బార్బర్ కటింగ్ చేస్తుంటే బుడ్డోడు..అర్రె నాకు కోపం వస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావ్..నిన్ను కొడతా. నేను కూడా నీ జట్టు కత్తిరిస్తా. నేను చాలా పెద్దోడ్ని, నిన్ను కటింగ్ చేయనివ్వను అంటూ కోపంగా ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్ నవ్వులు పువ్వులు పూయిస్తున్నాయి. ఆ ఎక్సెప్రెషన్స్ కు ఫిదా అయిన నెటిజన్లు లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. నెటిజన్లే కాదండోయ్ నటీనటులు సైతం ఫిదా అవుతున్నారు.
హీరోయిన్ రిచా చద్దా బుడ్డోడి ఎక్స్ ప్రెషన్స్ పై అర్రే అర్రే యార్ అంటూ కామెంట్ చేసింది.
మిర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ అలీఫజల్ సైతం ఫిదా అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం సెలూన్ షాపులో బుడ్డోడి హంగామా ఎలా ఉందో ఓ లుక్కేయండి.
Anushrut after haircut pic.twitter.com/Lt7QYhX0ku
— Anup (@Anup20992699) November 22, 2020