డ్రోన్ తో ‘కిడ్నీ’ డెలివరీ

అవయవాలను టైంకు హాస్పిటల్ కు చేర్చడమంటే మాటలు కాదు. పేషెంట్ ప్రాణాలు, అవయవం లైఫ్ క్షణక్షణానికి తరిగిపోతుంటుంది. అందుకే ట్రాఫిక్ ను ఆపేసి, రూట్ క్లియర్ చేసి అవయవాన్ని తరలించే వాహనాన్ని పంపేస్తుంటారు. భవిష్యత్ లో అవయవాల తరలింపుకు ఇన్ని అవాంతరాలు ఉండవు. ప్రపంచంలోనే తొలిసారి డ్రోన్ తో కిడ్నీని ట్రాన్స్ పోర్టు చేసి ఉబర్ రికార్డు సృష్టించింది. అమెరికాలోని బాల్టీమోర్ కు చెందిన త్రినా గ్లిప్సీ(44) కిడ్నీని అమర్చారు. త్రినా 8 ఏళ్లుగా డయాలసిస్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కోసం ఎదురుచూస్తున్న పేషెంట్ కు కిడ్నీని డ్రోన్ సమయానికి అందజేసింది. మేరీలాండ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ రీసెర్చర్లు కిడ్నీ ట్రాన్స్ పోర్టును పర్యవేక్షించారు. కిడ్నీ టెంపరేచర్‌‌ను రియల్ టైంలో కంట్రోల్ చేసే టెక్నాలజీని కూడా డ్రోన్‌‌లో వాడారు. బ్యాకప్‌‌గా ప్రొపెల్లర్స్, డ్యుయల్ బ్యాటరీలు, పారాచూట్‌‌ను డ్రోన్ కు అమర్చారు. దాదాపు 44 సార్లు పరీక్షించాక డ్రోన్‌‌లో కిడ్నీని పంపించారు. మున్ముందు చాలా మందికి ఇది ప్రాణదాతగా నిలుస్తుందని భావిస్తున్నారు

Latest Updates