ఈ బుడతడ్ని చూసి అలర్ట్ నెస్ అలవర్చుకోవాల్సిందే!

న్యూఢిల్లీ: మీ చుట్టు పక్కల ఏం జరుగుతుందనే దానిపై మీరు చాలా అప్రమత్తంగా ఉంటారా? అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే. పరిసరాల్లో ఏం ఉందో చూసుకోకుండా గుంతల్లో పడిపోవడం, జారి పడటం లాంటివి జరుగుతుంటాయి. అందుకే తన ముందు, పక్కన ఏం ఉన్నాయో చూసుకుంటూ నడుస్తున్న ఈ బుడతడి వీడియో చూసి అలర్ట్ గా ఎలా ఉండాలో నేర్చుకోవాల్సిందే. గ్లాస్ డోర్ లో నుంచి కనిపిస్తున్న వాటిని చూసి వీడియోలోని బుడతడు ఇచ్చిన రియాక్షన్స్ మిమ్మల్ని తప్పక నవ్విస్తాయి. ఈ వీడియో ఎవరు తీశారనేది తెలియ రాలేదు. కానీ ఎలీ అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోను రెక్స్ చాంప్ మన్ రీట్వీట్ చేశారు. పిల్లాడు ఫ్లోర్ లో కనిపిస్తున్న వాటిని చిత్రంగా చూస్తుండటం, భయపడినట్టు ఇస్తున్న హావభావాలు చాలా బాగున్నాయని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు 4.6 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఆలస్యం ఎందుకు మరి, మీరూ చూసేయండి.

Latest Updates