పొలార్డ్‌‌కే విండీస్​ వన్డే, టీ20 కెప్టెన్సీ

సెయింట్‌‌ జాన్స్‌‌ (ఆంటిగ్వా):  ఇండియా టూర్‌‌కు వచ్చే వెస్టిండీస్‌‌ వన్డే, టీ20 జట్లను కీరన్‌‌ పొలార్డ్‌‌ నడిపించనున్నాడు. వచ్చే నెలలో జరిగే రెండు సిరీస్‌‌ల కోసం విండీస్‌‌ జట్లను గురువారం ప్రకటించారు. పొలార్డ్‌‌కే రెండు జట్ల సారథ్యం అప్పగించారు. టీ20లకు నికోలస్‌‌ పూరన్‌‌, వన్డేలకు షై హోప్‌‌ వైస్‌‌ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. లఖ్​నవ్​ వేదికగా అఫ్గానిస్థాన్‌తో ఇటీవల జరిగిన లిమిటెడ్ ఓవర్ల సిరీస్‌లో సత్తాచాటిన ప్లేయర్లకే ఇండియాతో సిరీస్‌కు అవకాశం ఇచ్చారు.

విండీస్‌‌ టీ20 టీమ్‌‌: పొలార్డ్‌‌ (కెప్టెన్‌‌), అలెన్‌‌, బ్రేండన్‌‌ కింగ్‌‌,రామ్‌‌దిన్‌‌,  కాట్రెల్‌‌, లూయిస్‌‌, రూథర్‌‌ఫొర్డ్‌‌, హెట్‌‌మయర్‌‌, పైర్‌‌, సిమన్స్‌‌, హోల్డర్‌‌, హేడెన్‌‌ వాల్ష్‌‌, కీమో పాల్‌‌, పూరన్‌‌, కెస్రిక్‌‌ విలియమ్స్‌‌.

వన్డే టీమ్‌‌: పొలార్డ్‌‌ (కెప్టెన్‌‌), ఆంబ్రిస్‌‌, షై హోప్‌‌, ఖారీ పైర్‌‌, రోస్టన్‌‌ ఛేజ్​, అల్జారి , కాట్రెల్‌‌, బ్రెండన్‌‌ కింగ్‌‌, పూరన్‌‌, హెట్‌‌మయర్‌‌, లూయిస్‌‌, రొమారియో, హోల్డర్‌‌, కీమో పాల్‌‌, హేడెన్‌‌ వాల్ష్‌‌.

Latest Updates