నా కొడుకును చంపేయండి

kill-my-son-says-kidnapper-shankars-mother

కొందరు తల్లులు తమ కొడుకులు తప్పు చేసినా.. వారిని ఏదో విధంగా వెనకేసుకొస్తుంటారు. మా వాడు అలాంటి వాడు కాదని బుకాయిస్తారు. అయితే ఓ తల్లి మాత్రం తన కొడుకు పరమ దుర్మార్గుడని, వాడిని వెంటనే చంపేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో బీఫార్మసీ విద్యార్థిని సోని కిడ్నాప్ అయింది. పోలీసులు వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రవిశంకర్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

యువతి కిడ్నాప్ విషయంపై స్పందించిన రవిశంకర్ తల్లి.. ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకు కిడ్నాప్ చేసిన యువతి క్షేమంగా తిరిగి రావాలని తాను భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు ఇంతటి దారుణానికి పాల్పడ్డ తన కుమారుడు సమాజంలో ఉండకూడదని.. పట్టుకుని చంపేయాలని పోలీసులకు చెప్పింది.

రవిశంకర్ సోదరుడు కూడా వాడు మంచివాడు కాదని, ఎన్ కౌంటర్ చేసినా తమకు అభ్యంతరం లేదన్నాడు. రవిశంకర్ నేరగాడు కాబట్టే కాల్చేయాలని చెబుతున్నామని అన్నాడు.

Latest Updates