కాశ్మీర్​ను లూటీ చేసినోళ్లను చంపండి: గవర్నర్ మాలిక్

జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఆదివారం కార్గిల్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమాయకులను చంపేయడం ఆపేయాలని, ఏళ్ల తరబడి కాశ్మీర్ ను కొల్లగొట్టినోళ్లను టార్గెట్ చేయాలని టెర్రరిస్టులకు సూచించారు.  ‘తుపాకులు పట్టిన ఈ కుర్రోళ్లు.. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు, ప్రత్యేక పోలీసు అధికారులైన తమ ప్రజలనే చంపుతున్నరు. వాళ్లనెందుకు చంపుతున్నరు? అంతగనం చంపాలనుకుంటే కాశ్మీర్ సంపదను లూటీ చేసినోళ్లను టార్గెట్ చెయ్యుండి. అటువంటోళ్లను ఒక్కలనైనా చంపినరా?’ అని మాలిక్ ప్రశ్నించారు. ఏదేమైనా తుపాకులు ఎప్పటికీ పరిష్కారం చూపలేవని, ఎల్టీటీఈ నే అందుకు ఎగ్జాంపుల్ అంటూ వాటిని వదిలేయాలని సూచించారు. గన్నులకు ఇండియన్ సర్కారు ఎన్నటికీ తలవంచదని స్పష్టం చేశారు. హింసాత్మక మార్గాలను వదిలేయాలని టెర్రరిస్టులను కోరారు.

Latest Updates