సింగరేణి ఉద్యోగం కోసం హత్య చేసిన కుటుంబ సభ్యులు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామానికి చెందిన 56 ఏళ్ల ముత్తె శంకర్ అనే సింగరేణి కార్మికుడి హత్య కేసును చేధించారు పోలీసులు. కుటుంబ సభ్యులే సింగరేణి కారుణ్య నియామకం కోసం… భార్య విజయ, కూతురు స్వాతి, కొడుకు శ్రవణ్… కన్న తండ్రి ముత్తె శంకర్  ను హత్యచేసి ఆత్మహత్యగా  చిత్రీకరించారు. హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో వారిని అరెస్టు మీడియా ముందు ప్రవేశపెట్టారు బెల్లంపల్లి ఏసిపీ రహమాన్, రూరల్ సిఐ జగదీష్.

శంకర్ శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఆర్‌కె–7 గనిలో టింబర్‌మెన్‌గా విధులు నిర్వహించేవాడు. శంకర్ సర్వీస్ లో వుండగానే చనిపోతే ఈజీగా అతడి ఉద్యోగం కొడుకుకు వస్తుందని… అతడిని అడ్డు తొలగించుకోడానికి తల్లి పిల్లలు కలిసి కుట్ర పన్నారు. కూతురికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి మంచిర్యాల నుంచి రప్పించుకున్నారు. రాత్రి నిద్రపోతున్న సమయంలో  అతడి గొంతుకు చీర  బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. తర్వాత అదే చీరతో వేలాడదీసి ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు తమదైన స్టైల్లో విచారణ జరపడంతో …హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.

Latest Updates