కిమ్ కు ఏమీ కాలేదు

సియోల్ : నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ బతికే ఉన్నాడని సౌత్ కొరియా స్పష్టం చేసింది. కొన్ని రోజులుగా కిమ్ హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందంటూ ఆయన సర్జరీ ఫెయిల్ అయి బ్రెయిన్ డెడ్ అయ్యిందంటూ వార్తలు వస్తున్న తరుణంలో సౌత్ కొరియా క్లారిటీ ఇచ్చింది. సౌత్ కొరియా ప్రెసిడెంట్ విదేశీ వ్యవహారాల అడ్వయిజర్ గా ఉన్న మూన్ చుంగ్ ఇన్ ….కిమ్ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం గురించి వివరాలు వెల్లడించారు. కిమ్ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి అనుమానాస్పద కదలికలు తమకు కనిపించలేదని ఆయన చెప్పారు. ఏప్రిల్ 13 వ తేదీ నుంచి వాన్ సన్ లో కిమ్ ఉంటున్నారన్నారు. ఐతే ఏప్రిల్ 15 న తన తాత ఇల్ సంగ్ 108 జయంతి వేడుకల్లో కిమ్ పాల్గొకపోవటంతోనే కిమ్ హెల్త్ కండిషన్ పై అనుమానాలు మొదలయ్యాయి. అత్యంత ఘనంగా జరిపే ఈ వేడుకలకు కిమ్ తప్పకుండా హాజరవుతారు. ఇంతకన్నా ముఖ్యమైన కార్యక్రమానికి కిమ్ హాజరుకాలేదంటే కచ్చితంగా ఆరోగ్య సమస్యేనని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. అందుకు బలం చేకూర్చే విధంగా సీఎన్ఎన్ న్యూస్ లో కిమ్ హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందంటూ కథనాలు వచ్చాయి. చైనా డాక్టర్ల టీం కూడా నార్త్ కొరియా కు వెళ్లింది. పైగా 17 రోజులుగా కిమ్ పత్తా లేకుండా పోయారు. దీంతో కిమ్ ఆరోగ్య పరిస్థితి ఏమిటన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది.
రిసార్ట్ టౌన్ లో కిమ్ ట్రైన్
కిమ్ కుటుంబం మాత్రమే వాడే స్పెషన్ ట్రైన్ ఈ నెల 21, 23 తేదీల్లో రిసార్ట్ టౌన్ లో కనిపించింది. నార్త్ కొరియా లో ని 38 నార్త్ అనే సంస్థ శాటిలైట్ ద్వారా కిమ్ రైలు ఉన్న ప్రాంతాన్ని తీసిన ఫోటోలను బయటపెట్టింది. ఆ ట్రైన్ లోనే కిమ్ ఉండే అవకాశం ఉందని తెలిపింది. 2014 లోనే కిమ్ ఆరు వారాల పాటు కనిపించకుండా పోయారు. ఆయన కాలి మడమకు సర్జరీ జరగటంతో ఆయన రెస్ట్ తీసుకున్నారు. అప్పుడు కూడా కిమ్ హెల్త్ కండిషన్ పై ఇలాగే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Latest Updates