బంధం మరింత బలపడాలి.. కిమ్, పుతిన్ ఆకాంక్ష

కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు, అణ్వాయుధాల వాడకాన్ని నిరోధించేందుకు అమెరికా తరహాలోనే రష్యా కూడా సాయపడుతుందని ప్రెసిడెంట్​ పుతిన్​ చెప్పారు. ఈ క్రమంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, దేశభద్రత తదితర విషయాల్లో కొరియా ఆందోళనను అర్థం చేసుకోగలమని  అన్నారు. ఈమధ్య అమెరికా, ఉత్తర కొరియాల మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరకపోవడం తెలిసిందే! ఈ క్రమంలో ప్రెసిడెంట్​ కిమ్ జోంగ్​ఉన్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్‌పుతిన్‌ తో వ్లాదివోస్తోక్ లో గురువారం భేటీఅయ్యా రు.

ఫార్‌ ఈస్ట్‌‌‌‌‌‌‌‌ స్టేట్‌ యూనివర్సి టీలో జరిగిన ఈ సమావేశం షెడ్యూల్ ​టైంకన్నాఎక్కువసేపు.. దాదాపుగా రెండు గంటలపాటు కొనసాగింది. సమావేశం ముగిసాక నేతలిద్దరు బయటికి వచ్చి చివరిసారి కరచాలనం చేసుకున్నాక కిమ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత పుతిన్​ ఒంటరిగానే మీడియాతో మాట్లాడారు. మీటింగ్​ అర్థవంతంగా జరిగిందని చెప్పారు. ఇంటర్నేషనల్​ లాకు అన్నిదేశాలు కట్టుబడి ఉండే పరిస్థితి రావాలంటూ, కొరియా భూభాగంపై ఉద్రిక్తతలను తగ్గించేందుకు తమ మద్ధతు ఉంటుందన్నారు. ఈ ప్రాసెస్​లో కొరియా ఆందోళనలను, సెక్యూరిటీ పట్ల కోరుకుంటున్న గ్యారంటీని అర్థం చేసుకోవడానికి కిమ్‌‌‌‌‌‌‌‌ పర్యటన ఉపయోగ పడుతుందన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు పుతిన్ చెప్పారు.

Latest Updates