సెక్యూరిటీ అధికారిని పెళ్ళాడనున్న థాయ్ లాండ్ రాజు

సాధారణంగా ఒక దేశపు రాజుగాని, రాణి గాని ఎవరిని పెళ్లి చేసుకుంటారు ? మరో రాజవంశానికి చెందినవారిని పెళ్లి చేసుకుంటారు. అయితే రాజవంశాలకు చెందినవారు ఒక్కోసారి సామాన్యులను పెళ్లి చేసుకున్న సంఘటనలు చరిత్రలో ఉన్నాయి. ప్రస్తుతం థాయ్ లాండ్ రాజు ఈ పనే చేయబోతున్నాడు. థాయ్ రాజు మహా వాజిరాలాంకోర్న్ తన వ్యక్తిగత భద్రతా దళంలోని డిప్యూటీ కమాండెంట్ ను పెళ్లి చేసుకోబోతున్నాడు. రాజు హోదా కంటే సెక్యూరిటీ అధికారి తక్కువే కదా. మరి రాజు తలచుకుంటే పెళ్లి ఆగుతుందా. సుతిదా అనే ఈ భద్రతాధికారి గతంలో థాయ్ ఎయిర్వేస్ లో పనిచేసేది.

ఓసారి రాజుగారు విమానంలో వెళుతున్నప్పుడు ఈమెను చూసి మనసు పారేసుకున్నారు. వెంటనే ఆమెను తీసుకొచ్చి తన వ్యక్తిగత భద్రతా దళంలో డిప్యూటీ కమాండెంట్ గా నియమించాడు. ఇప్పుడు ఈమెనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మనసు పారేసుకున్న ప్రియురాలిని పెళ్లి చేసుకుంటున్న రాజుకు ఇది తొలి వివాహం కాదు. ఇప్పటివరకు ముగ్గురిని చేసుకొని వారికి విడాకులిచ్చాడు. ఇప్పుడు ఇది నాలుగో పెళ్లి.

Latest Updates