బ్యాంకులకు మాల్యా రిక్వెస్ట్ : కింగ్‌ఫిషర్‌ ను ఆదుకోవాలి

అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ ను కాపాడేందుకు SBI ఆధ్వర్యంలోని దేశీయ రుణదాతల పరిష్కార ప్రణాళికకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే ‘జెట్’ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌, ఆయన భార్య బోర్డు నుంచి వైదొలిగారు. దీనిపై విజయ్‌ మంగళవారం ట్విట్టర్ ద్వారా స్పందించాడు మాల్యా. తన విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కు కూడా ఇలాగే సాయపడితే బాగుండేదని.. ప్రభుత్వ రంగ బ్యాంకులపై సెటైర్లు వేశాడు. తన ఆస్తులను తీసుకుని జెట్‌ కు సాయం చేయండంటూ వరుస ట్వీట్లు చేశాడు.

‘ప్రభుత్వ రంగ బ్యాంకులు జెట్‌ ఎయిర్‌ వేస్‌ ను ఆదుకుని ఎందరో ఉద్యోగాలను, సంస్థను కాపాడటం ఆనందంగా ఉంది. అయితే కింగ్‌ఫిషర్‌ ను కూడా ఇలాగే ఆదుకొని ఉంటే బాగుండేది. కింగ్‌ఫిషర్‌ ను కాపాడండి అంటూ అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కు నేను రాసిన లేఖలపై BJP ప్రతినిధులు ఎన్నో ఆరోపణలు చేశారు. UPA హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కు తప్పుగా మద్దతిస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు NDA ప్రభుత్వ హయాంలో ఏం మారిందో.. నాకైతే ఆశ్చర్యంగానే ఉంది’ అని వరుస ట్వీట్లు చేశాడు మాల్యా.

Latest Updates