చెలరేగిన బౌలర్లు.. హైదరాబాద్ టార్గెట్-127

ఐపీఎల్-13లో భాగంగా శనివారం పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్లు మరోసారి సత్తా చాటారు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 రన్స్ మాత్రమే చేసింది. పంజాబ్ మంచి ప్రారంభం దక్కలేదు. కట్టుదిట్టమైన ఫీల్డింగ్, బౌలింగ్ తో హైదరాబాద్ ప్లేయర్లు అదరగొట్టారు. విధ్వంసక వీరుడు క్రిస్ గేల్(20) ను తక్కవ రన్స్ కే ఔట్ చేయడంతో .. పట్టు బిగించింది సన్ రైజర్స్. వెంటనే కేఎల్ రావుల్(27), మాక్స్ వెల్(12) కూడా ఔట్ కావడంతో తక్కువ స్కోర్ కే పరిమితమైంది పంజాబ్. నికోలస్ పూరన్(32 నాటౌట్) ఒక్కడే అత్యధిక రన్స్ చేశాడు.

హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ తలో 2 వికెట్లు తీశారు.

 

Latest Updates