కిరణ్ బేడికి మద్రాస్ హై కోర్టు షాక్

పుదుచ్చేరీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అధికారాలకు చెక్ పెట్టింది మద్రాస్ హై కోర్టు. లెప్టినెంట్ గవర్నర్ రోజువారి ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకుడదని రూలింగ్ ఇచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టినప్పట్నించీ కిరణ్ బేడీ అధికార వ్యవహరాల్లో జోక్యం చేసుకుంటుందనే ఆరోపణలు ఎదుర్కోంటుంది.

అప్పటి సీఎం సీఎం నారయణ స్వామీ , కిరణ్ బేడీ మధ్య అధికార వ్యవహారాలపై వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. కిరణ్ బేడీ అధికార యంత్రాంగం కార్యకలపాల్లో జోక్యం చేసుకోవడంపై.. కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మినారయణ గవర్నర్ రోజువారి విధుల్లో జోక్యం చేసుకోవడంపై 2017 లో వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు మంగళవారం ఈ తీర్పును వెలువరించింది.

Latest Updates