కిరణ్ బేడీని తొలగించాలంటూ..నల్లజెండాలతో నిరసన

పుదుచ్చేరి: పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీని తొలగించాలంటూ ఆ రాష్ట్ర సీఎం చేస్తున్న నిరసనలు ఆరో రోజుకి చేరాయి. ఇటీవల రాజ్ భవన్ ముందు నిద్రించి నిరసన తెలిపిన సీఎం నారాయణ స్వామి..ఇవాళ తన ఇంటిపై నల్లజెండాను ఎగరవేసి నిరసన తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కేంద్ర ప్రభుత్వం రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. బేడీ వల్ల రాష్ట్రంలో సమస్యలు తలెత్తుతున్నాయని నారాయణ స్వామి ఆరోపిస్తున్నారు.

టూ వీలర్ వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని కిరణ్‌ బేడి జారీ చేసిన ఆదేశాలను సీఎం నారాయణస్వామి తప్పుబ‌డుతున్నారు. రాష్ట్ర ప్రజలకు హెల్మెట్ వాడకంలో ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని, అప్పటి వరకు దశలవారీగా టూ వీలర్ వాహనాలను నడిపేవారు హెల్మెట్ వాడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Latest Updates