వ్యాపారి ఐడియా.. అరటి ఆకుల్లో ప్యాకింగ్

వాతావరణం పాడైపోతోందని ప్లాస్టిక్​కు దూరంగా ఉండమంటోంది ప్రభుత్వం. మరి, దానికి వేరే దారి ఏంటి? కొనుక్కునే వస్తువులను ఎందులో తీసుకెళ్లాలి? అంటే వచ్చే సమాధానాలు జూట్​ బ్యాగులు, పేపర్​ బ్యాగులు. జూట్​ బ్యాగులు ఓకే అయినా, పేపర్​ బ్యాగులు అనేసరికి మళ్లీ చెట్లను కొట్టేయాలి. దానికి ఆల్టర్నేటివ్​ ఏంటి? ఇదిగో ఆ చెట్లు ఇచ్చే ఆకులే. వస్తువులను ఆకుల్లో కట్టేసి తీసుకెళ్తే సరి.  కొన్ని హోటళ్లలో టిఫిన్లు, భోజనాన్ని అరటి ఆకుల్లో  కట్టిస్తారన్న సంగతి తెలుసు కదా. ఇదీ అంతే. అరుణాచల్​ ప్రదేశ్​లోని లెపా రడా జిల్లాలోని ఓ మారుమూల పల్లె అయిన టిర్బిన్​కు చెందిన ఓ మాంసం వ్యాపారి ఆ ఆలోచనను పక్కాగా అమల్లో పెట్టాడు. అరటి ఆకుల్లోనే మాంసం కట్టి ఇస్తున్నాడు. ఆ వీడియోను కేంద్ర మంత్రి కిరెణ్​ రిజిజు తన ట్విట్టర్​లో పోస్ట్​ చేశాడు. దానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆ వ్యాపారికి సలాం కొట్టారు.

Latest Updates